నవీ ముంబైలోని ఖార్హర్ ప్రాంతంలో ఒక కుటుంబ విషాదం నెలకొంది. ఒక పాకిస్తానీ వ్యక్తి తన భార్యను చంపి, ఆ తర్వాత ఆత్మహత్య చేసుకున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఆ జంటకు ఇద్దరు పిల్లలు ఉన్నట్లు సమాచారం. కాగా కుటుంబంలో గొడవలు, ఆర్థిక పరమైన ఇబ్బందులే ఈ దారుణానికి దారి తీశాయని పోలీసులు అనుమానిస్తున్నారు. పాక్‌కు చెందిన ఈ కుటుంబం, దీర్ఘకాలిక వీసాలపై ఇండియాకు వచ్చింది.