‘పాలమూరు-రంగారెడ్డి'కి జాతీయ హోదా ఇవ్వలేం: కేంద్రం

64చూసినవారు
‘పాలమూరు-రంగారెడ్డి'కి జాతీయ హోదా ఇవ్వలేం: కేంద్రం
తెలంగాణలోని పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంకు జాతీయ హోదా ఇవ్వలేమని కేంద్రం తేల్చి చెప్పింది. లోక్‌సభలో కాంగ్రెస్ ఎంపీ బలరాం నాయక్ అడిగిన ప్రశ్నకు జలశక్తి సహాయమంత్రి రాజ్ భూషణ్ చౌదరి పైవిధంగా సమాధానమిచ్చారు. టెక్నికల్ అంశాలు, న్యాయపరమైన చిక్కులు అడొస్తున్నాయన్నారు. AP, TGలో ఏ ఒక్క ఎత్తిపోతల పథకానికి హోదా ఇవ్వలేదని గుర్తుచేశారు. దీంతో విభజన చట్టం హామీని కేంద్రం విస్మరించిందని జాతీయ కాంగ్రెస్ మండిపడింది.

సంబంధిత పోస్ట్