భారత ప్లేయర్ రిషభ్ పంత్ ఫామ్‌లోకి వచ్చాడు. ప్రాక్టీస్ సెషన్‌లో భారీ షాట్లతో రెచ్చిపోయాడు. వాషింగ్టన్ సుందర్ బౌలింగ్‌లో కొట్టిన బంతి ఏకంగా స్టేడియంలోని రూఫ్‌ను బ్రేక్ చేసింది. దీనికి సంబంధించిన వీడియో వైరలవుతోంది. దీంతో ఇంగ్లాండ్‌తో జరిగే 5 టెస్టుల సిరీస్‌లోనూ పంత్ ఇదేవిధంగా ఆడాలని ఫ్యాన్స్ కోరుతున్నారు. ఈ నెల 20న తొలి టెస్టు మొదలు కానుంది.