పంత్ ICC నుంచి ఆంక్షలు ఎదుర్కొనే ప్రమాదం ఉంది. ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ 61వ ఓవర్‌లో సిరాజ్ వేసిన బంతిని హ్యారీ బౌండరీ బాదాడు. తర్వాత బంతి పరిస్థితిపై రిషభ్ పంత్ అసంతృప్తి చెందాడు. దీంతో బాల్‌ను పరిశీలించమని అంపైర్ వద్దకు తీసుకువెళ్లాడు. అంపైర్ బాల్ గేజ్ ద్వారా పరీక్షించి అంతా బాగుందని చెప్పాడు. దీంతో అసంతృప్తి చెందిన పంత్ బంతిని మైదానంలోకి విసిరి వెళ్లిపోయాడు. దీన్ని నేరంగా పరిగణించే ప్రమాదం ఉంది.