సందీప్ కిషన్ హీరోగా త్రినాథరావు నక్కిన తెరకెక్కిస్తున్న చిత్రం ‘మజాకా’. రీతూ వర్మ ఈ మూవీలో హీరోయిన్‌గా నటిస్తుంది. ఈనెల 26న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే, ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా ‘పగిలిపోయేట్టు డీజేలు’ అనే లిరికల్ సాంగ్‌ను మేకర్స్ విడుదల చేశారు. ‘హేయ్ కొట్టు కొట్టు పగిలేటట్టు, ఊరూ వాడా ఈల వేసేటట్టు’ అంటూ సందీప్ కిషన్ ఈ సాంగ్‌లో అదరగొడుతున్నాడు.