AP: అన్నమయ్య జిల్లా రాయచోటిలో ఉగ్రవాద సంబంధాలపై దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. ఇటీవల అరెస్టయిన అబూబకర్ సిద్ధిఖీ, మహ్మద్ అలీ ఇళ్లలో పోలీసులు మరోసారి సోదాలు జరిపారు. అబూబకర్ ఇంట్లో ఢిల్లీకి పంపేందుకు సిద్ధం చేసిన పార్శిల్ బాంబును స్వాధీనం చేసుకున్నారు. పేలుడు పదార్థాలు, పాస్‌పోర్టులు, బ్యాంకు పాస్‌బుక్స్ కూడా జప్తు చేశారు. ఈ ఘటనతో జిల్లా పరిధిలో భద్రతా ఏజెన్సీలు అప్రమత్తమయ్యాయి.