తాను లేకపోతే భార్యాబిడ్డలు బతకలేరేమోనన్న ఆందోళన.. భయంతోనే ముందుగా ఇంటి పెద్ద భాగస్వామిని ఆత్మహత్యకు ఒప్పించి, ఆపై పిల్లలను చంపి తమ ఉసురుతీసుకుంటున్నారని సైకియాట్రిస్ట్‌లు చెప్తున్నారు. ఆర్థిక సమస్యలు, బెట్టింగ్‌లాంటి వ్యసనాలు, కుటుంబ కలహాలు వంటివి కారణాలుగా పైకి కనిపించినా.. బలవంతంగా ఉసురు తీసుకునే స్వభావం వెనుక మానసిక రుగ్మతలు, వారి కుటుంబంలో అలాంటి చరిత్ర ఉండడం లాంటి అనేక కారణాలు ఉంటాయని చెప్తున్నారు.