TG: స్వర్గం నుంచి దిగివచ్చిన పేరెంట్స్ AI వీడియోను చూసి ఓ బాలిక కన్నీరు మున్నిరైంది. కరీంనగర్ మారుతినగర్‌కు చెందిన నిమ్మల చందు, సుమలత దంపతులు అనారోగ్యంతో 6ఏళ్ల క్రితం చనిపోయారు. వారికి కుమార్తె, కుమారుడు ఉన్నారు. కుమార్తె మనస్విక ఓణి పంక్షన్ చేపట్టిన కుటుంబ సభ్యులు ఆమెకు సర్‌ప్రైజ్ ఇచ్చారు. AI వీడియోను పంక్షన్ హాల్‌లో స్క్రీన్‌పై ప్రదర్శించారు. అది చూసిన చిన్నారి ఓ వైపు దుఖఃంతో, మరో వైపు సంతోషంగా కనిపించింది.