వైద్య విద్య, పరిశోధనల కోసం చనిపోయిన తమ రెండు రోజుల కూతురి మృతదేహాన్ని తల్లిదండ్రులు డొనేట్ చేసిన ఘటన డెహ్రాడూన్ లో చోటు చేసుకుంది. హరిద్వార్ కు చెందిన రామ్ మెహర్, నాన్సీ దంపతులకు మెదడు, శ్వాస సంబంధిత సమస్యలతో కూతురు జన్మించింది. ఆ శిశువును ఇంక్యుబేటర్లో ఉంచగా మృతి చెందింది. దీంతో డూన్ మెడికల్ కాలేజీకి బాడీని డొనేట్ చేశారు. ఇంత తక్కువ వయసున్న మృతదేహాన్ని దానం చేయడం దేశంలో ఇదే తొలిసారి అని డాక్టర్లు తెలిపారు.