మహారాష్ట్రలో హృదయాన్ని కలిచివేసే ఘటన చోటుచేసుకుంది. పదేళ్లు కూడా లేని ఇద్దరు అన్నదమ్ములు జ్వరం బారినపడి సకాలంలో వైద్యం అందక మృత్యువాత పడడంతో ఓ కుటుంబం కన్నీరుమున్నీరైంది. అదీకాక, ఆసుపత్రి నుంచి వారి మృతదేహాలను ఇంటికి తీసుకెళ్లడానికి కనీస సౌకర్యం లేకపోవడంతో దాదాపు 15 కి.మీ మేర భుజాలపై తమ కొడుకుల మృతదేహాలను మోసుకెళ్లారు. గడ్చిరోలిలోని అహేరి తాలుకాలో ఈ ఘటన చోటుచేసుకుంది. దీనిపై నెటిజన్లు తీవ్ర విమర్శలు చేస్తున్నారు.