నాలుగేండ్ల చిన్నారిని రూ.40 వేలకు కన్న తల్లిందండ్రులే అమ్మేసిన ఘటన ఒడిశాలోని భువనేశ్వర్‌లో చోటు చేసుకుంది. బీహార్‌కు చెందిన దంపతులు.. వారి 4 ఏళ్ల కుమార్తెను బుధవారం సంతానం లేని ఓ జంటకు రూ.40 వేలకు అమ్మేశారు. అయితే వారి ఇంటి యజమాని సమాచారం మేరకు పోలీసులకు రంగంలోకి దిగారు. పిప్లీ ప్రాంతంలో ఆ చిన్నారిని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు తల్లిదండ్రులతో పాటు మరో నలుగురిని ఒడిశా పోలీసులు అరెస్టు చేశారు.