గాయం మానేందుకు 15 రోజులు నా యూరిన్ తాగా: పరేశ్ రావల్

85చూసినవారు
గాయం మానేందుకు 15 రోజులు నా యూరిన్ తాగా: పరేశ్ రావల్
వెటరన్ బాలీవుడ్ యాక్టర్ పరేశ్ రావల్ ఓ షాకింగ్ విషయం బయటపెట్టారు. ఒక సినిమా షూటింగ్‌లో ఆయన మోకాలికి గాయమైంది. గాయం నుంచి కోలుకునేందుకు హీరో అజయ్ దేవగన్ తండ్రి వీరూ ఒక ప్రత్యేక సూచన ఇచ్చారు. అదేంటంటే.. "రోజూ పొద్దున తన మూత్రాన్ని తానే తాగితే గాయం తగ్గిపోతుంది" అని చెప్పారు. ఈ సలహాతో 15 రోజులపాటు పరేశ్ రావల్ తన యూరిన్‌ను బీర్‌లా తాగానని చెప్పారు. అది పనిచేసిందని, డాక్టర్లు కూడా షాకయ్యారన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్