కొనుగోలు బిల్లు ఉంటే ఎంతసేపైనా పార్కింగ్‌ ఉచితం!

58చూసినవారు
కొనుగోలు బిల్లు ఉంటే ఎంతసేపైనా పార్కింగ్‌ ఉచితం!
ప్రభుత్వ జీవో 63 ప్రకారం వ్యాపార సంస్థ ఉన్న సముదాయానికి అనుగుణంగా పార్కింగ్‌ స్థలం ఉండాలి. ఏ మల్టీప్లెక్స్, మాల్‌లో అయినా ప్రతి వినియోగదారుకి మొదటి అరగంట ఉచిత పార్కింగ్‌ కల్పించాల్సిందే. అరగంట మించినప్పుడు, అక్కడ ఏదేని కొనుగోలు చేసిన వస్తువు బిల్లు ఉంటే, ఎంతసేపు ఉన్నా పార్కింగ్‌కు రుసుం చేయకూడదు. అయితే చాలా వరకు మల్టీప్లెక్స్, మాల్స్‌లో సమయంతో పట్టింపు లేకుండా పార్కింగ్‌ రుసుం వసూలు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్