TG: సంగారెడ్డి జిల్లా పాశమైలారంలోని సిగాచీ ప్రమాద ఘటనలో మృతుల సంఖ్య 41కి చేరింది. ఘటన జరిగి ఏడు రోజులైనా ఇంకా 9 మంది ఆచూకీ దొరకలేదు. పేలుడు దాటికి శరీర భాగాలు ఛిద్రమై యంత్రాలకు అతుక్కుపోయినట్లు తెలుస్తోంది. దీంతో యంత్రాలు శుభ్రంచేస్తూ అవశేషాలను సేకరిస్తున్నారు. పరిశ్రమ ప్రాంగణంలో అడుగు మేర తవ్వుతూ అవశేషాల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.