పాశమైలారం ఘటన.. 40కి చేరిన మృతుల సంఖ్య

18చూసినవారు
పాశమైలారం ఘటన.. 40కి చేరిన మృతుల సంఖ్య
TG: సంగారెడ్డి జిల్లా పాశమైలారంలోని సిగాచీ పరిశ్రమ పేలుడు ఘటనలో మరో 3 మృతదేహాల వివరాలను గుర్తించారు. ఇద్దరు బిహార్‌, ఒకరిని ఒడిశా కార్మికులుగా గుర్తించారు. ఇప్పటివరకు 36 మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించారు. కాగా రియాక్టర్ భారీ పేలుడులో ఇప్పటి వరకు మృతి చెందిన వారి సంఖ్య 40కి చేరింది. సిగాచీ పరిశ్రమలో శిథిలాల తొలగింపు ఆరో రోజు కొనసాగుతోంది.

సంబంధిత పోస్ట్