తెలంగాణలోని మహబూబాబాద్ జిల్లా తొర్రూర్ మండల కేంద్రంలో బస్సులో సీటు కోసం ప్రయాణికులు కొట్టుకున్నారు. నా సీటులో నువ్వు కూర్చుంటావా అంటూ.. షర్ట్ కాలర్ పట్టుకుని ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ప్రభుత్వం మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించగా, కొన్నిసార్లు బస్సుల్లో పురుషులకు సీట్లు దొరకని పరిస్థితి నెలకొంటోందని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.