ఉత్తరప్రదేశ్ లోని లక్నోలో విషాదకర ఘటన వెలుగు చూసింది. King Goerge Medical Universityలో వెంటిలేటర్ కొరత కారణంగా చికిత్స పొందుతున్న ఓ రోగి మృతి చెందాడు. అయితే వెంటిలేటర్ కోసం ఆ పేషెంట్ పడుతున్న బాధ వర్ణనాతీతం. తనకు వెంటిలేటర్ ను సమకూర్చాలని సిబ్బందిని అతను చేతులెత్తి వేడుకుంటున్న తీరు కంటతడి పెట్టస్తోంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.