విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జరుగుతున్న బుక్ ఫెస్టివల్‌ను డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రత్యేకంగా సందర్శించారు. కల్యాణి పబ్లికేషన్స్, తెలుగు ఇస్లామిక్ పబ్లికేషన్స్ సహా మరికొన్ని స్టాళ్లను సందర్శించారు. అనంతరం.. 6, 9 తరగతుల పుస్తకాలు, డిక్షనరీ, ఎకనామిక్స్, ఫైనాన్స్ పుస్తకాలు, తెలుగులో అనువదించిన ఖురాన్ గ్రంథంతో పాటు చాలా పుస్తకాలను కొనుగోలు చేశారు. రూ.10 లక్షలు విలువ చేసే పుస్తకాలను ఆయన కొనుగోలు చేయడం విశేషం.