ప్రయాగ్‌రాజ్‌లోని మహా కుంభమేళాపై పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కౌంటర్ ఇచ్చారు. ‘సనాతన ధర్మంపై వ్యాఖ్యలు చేయడం మన నాయకులకు చాలా సులువు అయిపోయింది. లక్షలాది మంది ఓ చోట చేరినప్పుడు సవాళ్లు ఎదురవుతాయి. అలా అని విచారకర ఘటనలు జరగాలని కోరుకోము’ అని పేర్కొన్నారు.