నేటి నుంచి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. దక్షిణాది రాష్ట్రాల్లో పర్యటించనున్నారు.. హైందవ ధర్మ పరిరక్షణ కోసం కీలక నిర్ణయం తీసుకున్న పవన్.. ఈ నేపథ్యంలోనే దక్షిణ భారత దేశంలోని ప్రముఖ ఆలయాలను సందర్శించనున్నారు. అందులో భాగంగా కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లోని ప్రముఖ ఆలయాలను దర్శించుకోనున్నారు. ఈ రోజు ఉదయం హైదరాబాద్ నుంచి కేరళలోని కొచ్చిన్‌కు బయల్దేరి వెళ్లనున్నారు.