AP: డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దక్షిణాది రాష్ట్రాల పర్యటనకు బయలుదేరిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన కేరళలోని కొచ్చి విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడి నుంచి బయలుదేరి కొచ్చి సమీపంలోని శ్రీ అగస్త్య మహర్షి ఆలయాన్ని సందర్శించారు. అనంతరం మరికొన్ని దేవాలయాలను పవన్ ఈరోజు సందర్శించనున్నారు.