బాలయ్య బర్త్ డే సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ విష్ చేశారు. "శతాధిక చిత్రాల్లో కథానాయకుడిగా నటించి, చారిత్రక, జానపద, పౌరాణిక పాత్రలతో ప్రజాదరణ పొందిన శ్రీ నందమూరి బాలకృష్ణ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ప్రజా ప్రతినిధిగా హిందూపురం అభివృద్ధికి ఆయన చేస్తున్న సేవలు అభినందనీయం. ఆయనకు దీర్ఘాయుష్షు, సంపూర్ణ ఆరోగ్యం కలగాలని భగవంతుణ్ణి కోరుతున్నాను" అని ట్వీట్ చేశారు.