కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పుట్టిన రోజు సందర్భంగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విషెస్ తెలిపారు. ఈ సందర్భంగా X ద్వారా ఆయన ‘గౌరవ కేంద్ర గనుల శాఖ మంత్రి, నా మిత్రులు కిషన్ రెడ్డికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. సాధారణ కార్యకర్త స్థాయి నుంచి కేంద్ర మంత్రి స్థాయికి ఎదిగిన కిషన్ రెడ్డి రాజకీయ ప్రయాణం అభినందనీయం. మీరు సంపూర్ణ ఆయురారోగ్యాలతో, సంతోషంగా ఉండాలని, దేశానికి మరిన్ని సేవలు అందించాలని ఆకాంక్షిస్తున్నాను’ అంటూ పోస్ట్ చేశారు.