పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న తాజాచిత్రం ‘హరిహర వీరమల్లు’. నిధి అగర్వాల్ కథానాయిక. క్రిష్ జాగర్లమూడి, జ్యోతికృష్ణ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రం మార్చి 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం ఇటీవల పవన్ కళ్యాణ్ పాడిన తొలి పాట ‘మాట వినాలి’ బీటీఎస్‌ను విడుదల చేసింది. దీనికి కీరవాణి స్వరాలు అందించారు.