ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సతీమణి అన్నాలెజినోవా ఆదివారం తిరుమలకు చేరుకున్న సంగతి తెలిసిందే. పద్మావతి విచారణ కార్యాలయం వద్దకు చేరుకున్న అన్నాలెజినోవా శ్రీవారికి తలనీలాలు సమర్పించారు. అక్కడ నుంచి నేరుగా ఆలయ సాంప్రదాయంను పాటిస్తూ భూవరాహ స్వామివారిని దర్శించుకున్నారు. రాత్రికి తిరుమలలోనే ఆమె బస చేయనున్నారు. రేపు ఉదయం శ్రీవారిని అన్నాలెజినోవా దర్శించుకొని మొక్కులు చెల్లించుకోనున్నారు.