TG: ప్రతి ఒక్కరూ శారీరక ఆరోగ్యంపై శ్రద్ద చూపాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. నెక్లెస్ రోడ్లో నిర్వహించిన ఆర్థోపెడిక్ వాక్ థాన్‌ను మంత్రి పొన్నం ప్రభాకర్ జెండా ఊపి ప్రారంభించారు. మంత్రి మట్లాడుతూ ఆర్థోపెడిక్ సమస్యలపై ప్రజల్లో అవగాహన అవసరమన్నారు. తమ జీవితంలో రోజు వారీ వాకింగ్, రన్నింగ్ చేయడం అవసరమని చెప్పారు. ఈ వాక్ థాన్‌ను నెక్లెస్ రోడ్ నుంచి సంజీవయ్య పార్క్ వరకు నిర్వహించారు.