పెద్దగట్టు జాతర ఆరంభమైంది. ఇవాళ్టి నుంచి 20వ తేదీ వరకు కొనసాగనుంది. తెలంగాణలో మేడారం జాతర తర్వాత రెండో అతిపెద్ద జాతరగా పేరొందిన శ్రీలింగమంతుల స్వామి పెద్దగట్టు జాతర ఘనంగా ప్రారంభమైంది. సూర్యాపేట జిల్లా దురాజ్‌పల్లిలో ప్రతి రెండేళ్లకోసారి జరిగే ఈ మహా జాతరకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, ఒడిశా సహా పలు రాష్ట్రాల నుండి 15 లక్షల మందికి పైగా భక్తులు హాజరుకానున్నారు.