పెద్దగట్టు స్థల పురాణం

66చూసినవారు
పెద్దగట్టు స్థల పురాణం
రాష్ట్ర కూట వంశానికి చెందిన ధ్రువుడు తన పేరిట ఇక్కడ గ్రామాన్ని నిర్మించాడని, అదే కాలక్రమేణా దురాజ్‌పల్లిగా మారిందని అంటారు. కాకతీయుల కాలంలో ఉండ్రుగొండ కొండ‌పై శివకేశవులు ఆలయాలు ఉండేవి. ఇక్కడ ఏటా అంగరంగ వైభవంగా ఉత్సవాలు నిర్వహించేవారు. ఈ ఉత్సవాల్లో మొక్కులు చెల్లించేందుకు గుట్టకు వచ్చిన ఓ గర్భిణి పైకి ఎక్కుతుండగా జారిపడి మరణించిందని, ఈ ఘటనకు చలించిపోయిన స్వామి భక్తులకు వీలుగా ఉండేట్లు పాలసేర్లయ్య గుట్ట‌పై లింగమంతుల స్వామిగా వెలిశారని చెబుతారు.

సంబంధిత పోస్ట్