కొండగట్టు ఆలయ ఈవోగా రామకృష్ణారావు నియామకం

58చూసినవారు
కొండగట్టు ఆలయ ఈవోగా రామకృష్ణారావు నియామకం
ప్రముఖ పుణ్య క్షేత్రమైన శ్రీ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ ఈవోగా రామకృష్ణారావును నియమిస్తూ దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. కొండగట్టు ఆలయ ఈవోగా అదనపు బాధ్యత నిర్వహిస్తున్న చంద్రశేఖర్ను మెదక్ అసిస్టెంట్ కమిషనర్గా బదలీ చేశారు. బాధ్యతలు తీసుకున్న సందర్భంగా మాట్లాడుతూ, ఆలయ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని, సదుపాయాలు మెరుగు పరుస్తానని రామకృష్ణారావు తెలిపారు.

సంబంధిత పోస్ట్