చొప్పదండి: నవోదయ పరిమిత సీట్ల ప్రవేశ పరీక్షకు ఏర్పాట్లు పూర్తి

65చూసినవారు
చొప్పదండి: నవోదయ పరిమిత సీట్ల ప్రవేశ పరీక్షకు ఏర్పాట్లు పూర్తి
చొప్పదండి నవోదయ విద్యాలయంలో 9, 11వ తరగతులలో పరిమిత సీట్లకు శనివారం జరిగే ప్రవేశ పరీక్షకు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 9వ తరగతిలో ప్రవేశానికి 1340 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా, 11వ తరగతిలో ప్రవేశానికి 1278 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నట్లు ప్రిన్సిపల్ మంగతాయారు తెలిపారు. అభ్యర్థులు 10 గంటల లోపు హాల్ టికెట్, ఆధార్ కార్డుతో హాజరు కావాలని శుక్రవారం ప్రిన్సిపల్ సూచించారు.

సంబంధిత పోస్ట్