బోయినపల్లి మండల కేంద్రములో వాహనాల రవాణా త్రైమాసిక ఫీజులు, టాక్స్ బకాయిల చెల్లింపులపై తెలంగాణ సాంస్కృతిక సారథి పొత్తూరి రాజు కళాబృందం జిల్లా రవాణా శాఖ అధికారి ఆధ్వర్యంలో శుక్రవారం కళా ప్రదర్శనలు నిర్వహించారు. టీమ్ లీడర్ పొత్తూరి రాజు, కళాకారులు గడ్డం దేవయ్య, పూడూరి సంజీవ్, అంతడుపుల ఝాన్సి, అంతడుపుల లావణ్య, కిన్నెర శ్రీలత, అనుముల శిరీష గ్రామ ప్రజలు పాల్గొన్నారు.