లీగల్ ఫోరం ఫర్ తెలంగాణ న్యాయ వేదిక రాష్ట్ర కమిటీ సమావేశం మంగలవారం ఓయూలో జరిగింది. సమావేశంలో నూతన రాష్ట్రకమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఫోరం రాష్ట్ర అధ్యక్షుడిగా గంగాధర మండలం ఘర్షకుర్తి కి చెందిన సీనియర్ న్యాయవాది దూస గౌరీశం ఎన్నికయ్యారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్రం అనేక సవాళ్లను ఎదుర్కొంటోందని, మన హక్కులను కాపాడటానికి, న్యాయం కోసం పోరాడటానికి ఫోరం కృషి చేస్తుందన్నారు.