జిల్లాలో రెచ్చిపోతున్న వేటగాళ్లు

83చూసినవారు
జిల్లాలో రెచ్చిపోతున్న వేటగాళ్లు
జగిత్యాల జిల్లాలో వేటగాళ్లు రెచ్చిపోతున్నారు. వన్యప్రాణులను కుక్కలతో దాడి చేయిస్తూ చంపుతున్నారు. ఇటీవల కొండగట్టులో ఉడుములను చంపిన ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. వన్యప్రాణుల మాంసాన్ని అధిక ధరలకు విక్రయిస్తూ వేటను జీవనోపాధిగా మలచుకుంటున్నారు. కాగా జిల్లాలో 53 వేల హెక్టార్లలో అడవులు విస్తరించి ఉన్నాయి. అటవీ అధికారులు ప్రత్యేక దృష్టి సారించి అటవీ సంపదను కాపాడాలని పలువురు విజ్ఞప్తి చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్