కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి దేవస్థానంలో ఆగస్టు 5 నుంచి 11 వరకు శ్రావణ సప్తాహ ఉత్సవాలు నిర్వహించనున్నట్లు ఆలయ ఈవో గురువారం తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, వారం రోజుల పాటు నిత్యం మూలవిరాట్తో పాటు ఉపాలయాల్లోని అమ్మవారి ఆలయం, శ్రీవెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పారు.