చొప్పదండి మండలం అర్నకొండకు చెందిన యువ మహిళా ఎస్ఐ కొక్కుల శ్వేత మంగళవారం ఉదయం రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలైన విషయం తెలిసిందే. మృతదేహాన్ని కారు నుంచి వెలికి తీసిన పోలీసులు పోస్టుమార్టం చేయించారు. అనంతరం పోలీసు అధికారిక లాంఛనాలతో శ్వేత అంత్యక్రియలు నిర్వహించారు. ఎంతో ఉజ్వల భవిష్యత్తు కలిగిన పోలీసు అధికారి శ్వేత చిన్నతనంలోనే మృతి చెందడం పట్ల పోలీస్ శాఖ సిబ్బంది, అధికారులు ప్రగాఢ సంతాపం తెలిపారు.