రామడుగు మండలం వెలిచాల గ్రామ పరిధి వెలిచాల గ్రామం నుండి కొత్తపల్లి వెళ్లే దారిలోని వంతెన వద్ద కుంగిపోయి గుంతలు పడడంతో ప్రయాణికులకు రాక పోకలకు ప్రమాదకరంగా, ఇబ్బందిగా మారడంతో బుధవారం కంకర సిమెంట్ లతో సింగిల్ విండో చైర్మన్ వీర్ల వెంకటేశ్వరరావు రోడ్డు మరమ్మత్తులు చేపించినారు. మాజీ సర్పంచ్ వీర్ల రవీందర్ రావు, మాజీ రైతుబంధు సమితి సభ్యులు వీర్ల సంజీవరావు, ఉప సర్పంచ్ పూదరి వెంకటేష్, తదితరులు ఉన్నారు.