గ్రామ గ్రామాన ఉన్న యాదవులను చైతన్య పరిచి ప్రభుత్వ పరంగా న్యాయంగా యాదవులకు దక్కాల్సిన హక్కులను సాదించుకోవడమే లక్ష్యంగా ముందుకు వెళదామని యాదవ సంఘం అడహాక్ కమిటీ జగిత్యాల జిల్లా అధ్యక్షుడు ఘనవేని మల్లేశ్ యాదవ్ అన్నారు. కొడిమ్యాల మండలం నల్లగొండ, తిప్పయ్య పల్లి గ్రామాల్లో శుక్రవారం యాదవ సంఘం సభ్యులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా సభ్యత్వాన్ని స్వీకరించారు. పలువురు యాదవులు ఉన్నారు.