కొండగట్టులో కొనసాగుతున్న భక్తుల సందడి

75చూసినవారు
కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి సన్నిధిలో శనివారం భక్తుల సందడి కొనసాగింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు సుమారుగా 30 వేల వరకు భక్తులు అంజన్నను దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు. ఆదివారం సెలవు దినం కావడంతో ఇంకా కొండపైకి భక్తుల రాక కొనసాగుతది. ఇదిలా ఉండగా, ఇటీవల ఈవో వాహనాలను పైకి అనుమతించకుండా ఆదేశాలు జారీ చేసినప్పటికీ ఈవో కార్యాలయం ముందుగల చలువ పందిళ్ళ కింద వాహనాలు పార్కింగ్ చేయడం గమనార్హం.

సంబంధిత పోస్ట్