బోయినపల్లి మండలం వెంకట్రావుపల్లి, గంగాధర మండలం ఒద్యారం గ్రామాల మధ్య కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. కరీంనగర్ వేములవాడ ప్రధాన రహదారిపై వచ్చి పోయే ద్విచక్ర వాహనదారుల వెంట కుక్కలు వెంబడిస్తున్నాయి. రోజురోజుకు కుక్కల బెడద ఎక్కువ అవుతుండటంతో ద్విచక్ర వాహనదారులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి కుక్కల బారి నుంచి రక్షించాలని గురువారం మీడియా ద్వారా కోరుతున్నారు.