జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం బతికేపల్లి మాజీ సర్పంచ్, పెగడపల్లి మాజీ జడ్పిటీసి, రాష్ట్ర మహిళ కాంగ్రెస్ కార్యదర్శి తాటిపర్తి శోభారాణి శనివారం వ్యవసాయ పొలంలో వరి నాట్లు వేస్తుండగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేరును వరి నారుతో ప్రదర్శించి రైతుల పక్షపాతి సీఎం అని చాటి చెప్పారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ మహిళలకు ఉచిత రవాణా సౌకర్యం కల్పించిన ఘనత సిఎం రేవంత్ రెడ్డిది అని కొనియాడారు