స్పీకర్ గా ఒక దళితుడు ఉన్నాడన్న అహంకారంతో కేసీఆర్ అసెంబ్లీకి రావడం లేదని ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సంచలన ఆరోపణలు చేశారు. శుక్రవారం జగిత్యాల జిల్లా ధర్మపురిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై నిన్న మీడియా సమావేశంలో చేసిన ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నం అన్నారు.