జగిత్యాల జిల్లా కేంద్రంలో ఆర్డీఓ కార్యాలయం ముందు గత 13 రోజులుగా జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల సాధన కోసం చేసేస్తున్న నిరవధిక నిరసన దీక్షలో ఎండపల్లి మండల టీయూడబ్ల్యూజే (ఐజేయు) సంఘం నేతలు గురువారం మద్దతు తెలిపారు. కార్యక్రమంలో ఐజేయు జగిత్యాల జిల్లా అధ్యక్షుడు చీటి శ్రీనివాస రావు మాట్లాడుతూ గత మూడు దశాబ్దాల కాలంగా ప్రభుత్వాలు జర్నలిస్టులను ఇళ్ల స్థలాలు ఇవ్వక మభ్యపెడుతున్నాయని అన్నారు.