ధర్మారం మండల కేంద్రంలోని స్థానిక శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయంలో గురువారం ప్రత్యేక పూజలు నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. సాయంత్రం 6 గంటలకు శ్రీకృష్ణ-రుక్మిణిల కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు చెప్పారు. కావున భక్తులు అధిక సంఖ్యలో హాజరై స్వామివారి సేవలో పాల్గొనాలని కోరారు.