ఒక యువతితో నిశ్చితార్థం.. మరో యువతితో పెళ్లి

71చూసినవారు
ఒక యువతితో నిశ్చితార్థం.. మరో యువతితో పెళ్లి
హుజురాబాద్ మండలం రంగాపూర్కు చెందిన కుంట శ్రీనివాస్ రెడ్డి చిన్న కుమారుడు మధుకర్ రెడ్డికి కాట్రపల్లికి చెందిన ఓ యువతితో పెళ్లి నిశ్చయమైంది. నిశ్చితార్థం కూడా జరిగింది. అయితే, ఆ అమ్మాయితో నేడు పెళ్లి జరగాల్సి ఉండగా నిన్న మరో అమ్మాయిని మధుకర్ రెడ్డి పెళ్లి చేసుకున్నాడు. అమ్మాయి తల్లిదండ్రులు శుక్రవారం హుజురాబాద్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్