కోరపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం.. వ్యక్తి మృతి

55చూసినవారు
కోరపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం.. వ్యక్తి మృతి
ఘోర రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందిన ఘటన జమ్మికుంట మండలం కోరపల్లి గ్రామంలో శుక్రవారం సాయంత్రం చోటుచేసుకుంది. ఇల్లంతకుంట మండల కేంద్రానికి చెందిన పెద్ది భాస్కర్ అనే వ్యక్తి పెద్దపెల్లి జిల్లా కేంద్రంలో ప్రైవేటు ఉద్యోగం చేస్తూ తిరిగి స్వగ్రామం ఇల్లంతకుంటకు వచ్చే క్రమంలో కోరపల్లి గ్రామంలో ఆగి ఉన్న ట్రాక్టర్ వెనక భాగం అతివేగంగా వచ్చి ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్