వీణవంక పరిధిలో విద్యుత్ కష్టాలు

68చూసినవారు
వీణవంక పరిధిలో విద్యుత్ కష్టాలు
వీణవంక మండలం వల్భాపూర్ గ్రామ పరిధిలో శనివారం సాయంత్రం విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. దాదాపు రెండు గంటల పాటు విద్యుత్ సరఫరాలో ఆటంకం కల్గిందని గ్రామస్థులు వాపోయారు. చీకటి వేళ ఇలా విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడటంతో చిన్నారులు, వృద్ధులు ఇబ్బందులు ఎదుర్కోంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చీకట్లో విషపురుగుల సంచారం ఉంటుందని విద్యుత్ అంతరాయంతో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందంటున్నారు.

సంబంధిత పోస్ట్