హుజురాబాద్ మండలం కేంద్రంలో బీసీ ఆజాది యూత్ ఫెడరేషన్ మండల కార్యవర్గ సమావేశం శుక్రవారం నిర్వహించారు. ఈ సమావేశంలో బీసీ ఆజాది యూత్ ఫెడరేషన్ వ్యవస్థపాక అధ్యక్షుడు జక్కని సంజయ్ కుమార్ మాట్లాడుతూ. బీసీల హక్కుల కోసం అలుపెరుగని పోరాటం చేస్తామన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు కుడికాల భాస్కర్, జిల్లా కన్వీనర్ చిలుకమారి శ్రీనివాస్, నియోజకవర్గ అధ్యక్షుడు పంజాల తిరుపతి గౌడ్ తదితరులున్నారు.