జగిత్యాల రూరల్ మండలం జాబితాపూర్ గ్రామంలో గురువారం అంబేద్కర్ యువజన సంఘం, మున్నూరు కాపు సంఘం, గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ మహనీయుల త్యాగ ఫలితంగా స్వాతంత్రం వచ్చిందని, అలాంటి మహనీయులను ప్రతి ఒక్కరు ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు.