జగిత్యాల రూరల్ మండలం జాబితాపూర్ గ్రామంలో గురువారం ప్రాథమిక పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు కొండలేపు శ్రీనివాస్ ఆధ్వర్యంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. చిన్నారులు మహనీయుల వేషధారణలో ఆకట్టుకున్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు.