ఇంటింటా ఇన్నోవేటర్ వేదికగా నూతన ఆలోచనలకు ఆహ్వానం పలుకుతూ, గ్రామస్థాయిలో ఇన్నోవేషన్ ఆవిష్కరణను ప్రోత్సహించాలని జగిత్యాల జిల్లా అదనపు కలెక్టర్ గౌతమ్ రెడ్డి అన్నారు. శుక్రవారం జిల్లా కార్యాలయంలో ఇన్నోవేషన్ కార్యక్రమంపై గ్రామ పంచాయతీ కార్యదర్శులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కో ఆర్డినేటర్ జలేందర్, డిప్యూటీ సీఈఓ రఘువరన్ పాల్గొన్నారు.